Jabardasth : ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా వాడుకొని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్

గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ యువతీ తో సందీప్ కు స్నేహం ఏర్పడింది

  • Written By:
  • Publish Date - August 20, 2023 / 12:12 PM IST

సమాజంలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రెండు రోజుల్లోనే ప్రేమ పుట్టడం..ఆ తర్వాత శారీరకంగా దగ్గర అవ్వడం..ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు. కొంతమంది మాత్రం పెళ్లి పేరుతో యువతులకు దగ్గరై..వారి కోర్కెలు తీర్చుకొని , ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే దూరం పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూ వస్తున్నాయి. తాజాగా చిత్రసీమలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో (Jabardasth )..ఎంతమంది ఆర్టిస్టులకు జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ చిత్రసీమకు పరిచమై రాణిస్తున్నారు. ఇలాంటి ఈ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారిలో నవ సందీప్ (Nava Sandeep) ఒకరు. కామెడిగానే కాకుండా సింగర్ గా కూడా అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఇతడు..ఓ అమ్మాయిని ప్రేమ , పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకొని ఆమెను మోసం చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ యువతీ తో సందీప్ కు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమ (Love) కు దారితీసింది. ప్రేమలో నిండా మునిగిని వీరిద్దరూ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నారు. ఇదే క్రమంలో శారీరకంగా పలుమార్లు కలిశారు. ఇక ఇప్పుడు సందీప్..కెరియర్ ఊపందుకోవడం..కాస్త పాపులార్టీ రావడంతో సదరు యువతీ ని దూరం పెట్టడం చేస్తూ వస్తున్నాడట. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని సదరు యువతీ ప్రశ్నించగా..మాట మారుస్తూ తిరుగుతున్నాడట. కనీసం ఆమె ఫోన్ లెఫ్ట్ చేయడం కానీ , కలవడం కానీ చేయడం లేదట. దీంతో తనను సందీప్ మోసం చేసాడని గ్రహించి ..మధుర నగర్ పోలీస్ స్టేషన్ లో సందీప్ ఫై పిర్యాదు చేసింది. యువతీ పిర్యాదు మేరకు పోలీసులు సందీప్ ఫై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

Read Also : Viral : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు