Taliban: 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం.. తాలిబన్ల పనేనా!

ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం జరిగింది. అయితే తాలిబన్లు ఈ సంఘటనలో తమ ప్రమేయాన్ని ఖండించారు.

Taliban:  ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 80 మంది పాఠశాల బాలికలపై విషప్రయోగం జరిగింది. అయితే తాలిబన్లు ఈ సంఘటనలో తమ ప్రమేయాన్ని ఖండించారు. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రాథమిక పాఠశాలలపై జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో దాదాపు 80 మంది బాలికలపై విషప్రయోగం జరిగింది. దీంతో వారు ఆసుపత్రి పాలయ్యారని స్థానిక విద్యాశాఖ అధికారి తెలిపారు.

సార్-ఎ-పుల్ ప్రావిన్స్‌లో శని, ఆదివారాల్లో ఈ దాడులు జరిగాయి. సంచారక్ జిల్లాలో సుమారు 80 మంది విద్యార్థినులు విషప్రయోగానికి గురయ్యారని విద్యాశాఖ అధిపతి మహ్మద్ రహ్మానీ తెలిపారు. నస్వాన్-ఎ-కాబాద్ అబ్ స్కూల్‌లో 60 మంది, నస్వాన్-ఎ-ఫైజాబాద్ పాఠశాలలో 17 మంది విద్యార్థులు విషప్రయోగానికి గురయ్యారని చెప్పారు. అయితే వారిపై విషప్రయోగానికి కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థినులు చదువుకోవడం వారికే నచ్చకే తాలిబన్లు విషప్రయోగం జరిపినట్టు అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Read More: Suicide : ఖ‌మ్మం మ‌మ‌త మెడిక‌ల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌