మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara rao )..కాంగ్రెస్ పార్టీ (Congress) లో చేరబోతున్నట్లు గత వారం రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. రీసెంట్ గా బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన లో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడం తో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ప్రకటన తర్వాత తుమ్మల అనుచరులు వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని వారంతా అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు.
Read Also : Massage Centers : బంజారాహిల్స్ మసాజ్ సెంటర్ లో పాడుపనులు..బట్టబయలు చేసిన పోలీసులు
మరోపక్క తుమ్మల సైతం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ (BRS) ను ఎంతగానో నమ్ముకుంటే..తనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మలను తమ పార్టీ లోకి ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి రేణుక తో తుమ్మల వర్గీయులు భేటీ అయ్యారు. వచ్చే నెల మొదటి వారం లో రాహుల్ తో కలిసి తుమ్మల ఢిల్లీ వెళ్లనున్నారని..అక్కడ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతారని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ..తుమ్మల కాంగ్రెస్ లో చేరిక వార్తల ఫై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Bhadrachalam MLA Podem Veeraiah) స్పందించారు.
భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం తుమ్మల ఎనలేని సేవచేశారని, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే.. పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలోకి రావాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. మరి తుమ్మల కాంగ్రెస్ లో చేరతారా..లేదా అనేది చూడాలి.