G20 Summit: ఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక జీ20 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. G20 ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేసిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వ గురువు మరియు విశ్వ బంధువుగా అభివర్ణించారు. సమిట్ ను ప్రధాని మోడీ విజయవంతంగా ప్రదర్శించారని కొనియాడారు. మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత అధ్యక్ష ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని ట్వీట్ చేశారు. అదేవిధంగా G20 సమ్మిట్ సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం భారత్ విశ్వాసాన్ని బయటపెట్టిందని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ పై ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. విశ్వవ్యాప్త రాజకీయాలు, వాతావరణ పరిస్థితుల సమస్యలపై ప్రపంచ శక్తులను ఏకాభిప్రాయానికి తీసుకువచ్చినందకు న్యూ ఢిల్లీ నాయకుల డిక్లరేషన్‌ను ఆమోదించడం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. జీ20 సదస్సు శనివారం ప్రారంభమై ఆదివారంతో ముగిసింది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇన్ సియో లులా డా సిల్వా, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో పాటు పలువురు ప్రపంచ అగ్రనేతలు ఇక్కడ సమావేశమయ్యారు.