Site icon HashtagU Telugu

PM Modi Aircraft: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం

PM Modi Aircraft

PM Modi Aircraft

PM Modi Aircraft: ప్రధాని నరేంద్ర మోదీ శుక్ర‌వారం జార్ఖండ్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ డియోఘర్ నుంచి ఢిల్లీకి రావాల్సి ఉండగా ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో (PM Modi Aircraft) సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం డియోఘర్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగాల్సి వచ్చింది. దీంతో ప్ర‌ధాని ఢిల్లీకి తిరిగి రావడంలో కొంత జాప్యం జరిగింది. దేవ్‌ఘర్‌కు ముందు ప్రధాని మోదీ బీహార్‌లోని జముయికి చేరుకున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆదివాసీ వర్గాల కృషిని కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు గుర్తించలేదని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

కాంగ్రెస్ లేదా ఎవరి పేరు చెప్పకుండా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. క్రెడిట్ మొత్తం ఒకే పార్టీకి, ఒక కుటుంబానికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఒక కుటుంబం వల్లే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, అయితే బిర్సా ముండా ‘ఉల్గులన్’ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వాల హయాంలో భారతదేశంలోని గిరిజన సమాజానికి తగిన గుర్తింపు లభించలేదని ప్రధాని ఉద్ఘాటించారు. భారతదేశంలోని గిరిజన సమాజానికి ఇంతకు ముందు న్యాయం జరగలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో గిరిజన నాయకులు ముఖ్యపాత్ర పోషించారు. లార్డ్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ ప్రైడ్ డే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాన మంత్రి కూడా గిరిజన జనాభా పట్ల తనకున్న గౌరవాన్ని పునరుద్ఘాటించారు. ప్రకృతి, పర్యావరణ అనుకూల జీవనశైలితో వారి లోతైన అనుబంధానికి వారిని “ఆరాధిస్తున్నాను” అని అన్నారు.

Also Read: Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఐసీసీ కీల‌క నిర్ణయం

గిరిజన వర్గాల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి తమ‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రధాని మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. దేశ అభివృద్ధిలో గిరిజ‌నుల ముఖ్యమైన పాత్రను గుర్తించారు. గిరిజన వర్గాల అభ్యున్నతికి త‌మ ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుందని ప్రధాని చెప్పారు. గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్‌ను పెంచడం లాంటివి అన్నారు. బ‌డ్జెట్‌లో రూ.25,000 కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లు గిరిజ‌నుల‌కు కేటాయించమ‌న్నారు.

అదే సమయంలో లార్డ్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో లార్డ్ బిర్సా ముండా ఆదర్శాలు గిరిజనులకే కాకుండా దేశంలోని అన్ని వర్గాల యువతకు గర్వకారణం, ప్రేరణ అని పోస్ట్ చేశారు.

 

Exit mobile version