National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ

  • Written By:
  • Updated On - March 8, 2024 / 02:26 PM IST

 

National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్​ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్​ అవార్డ్స్​ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్​ క్రియేటివ్ క్రియేటర్ ​గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్​ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్​గా కీర్తికా గోవిందసామి, కల్చరల్​ అంబాసిడర్ ఆఫ్​ ది ఇయర్ అవార్డును గాయని మైథిలీ ఠాకూర్, టెక్​ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్తగా గౌరవ్​ చౌదిరికు అవార్డును అందజేశారు. 20 విభాగాల్లో మొత్తం 23 మంది విజేతలకు ఈ అవార్డులను ఇచ్చారు.

ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో సుమారు 1.5 లక్షలపైగా నామినేషన్లు వచ్చాయి. ఈ విజేతల కోసం ఓటింగ్​ను నిర్వహించారు. అందులో 10 లక్షల మంది ఓట్లు వేశారు. విజేతలుగా అంతర్జాతీయ క్రియేటర్లు సహా 23 మంది నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

 ప్రస్తుత జనరేషన్​లో సోషల్​ మీడియా హవా నడుస్తోంది. తమ ట్యాలెంట్​ను నిరూపించుకునేందుకు కూడా సోషల్​ మీడియానే ఉపయోగించుకున్నారు యువత. సోషల్​ మీడియా ద్వారా ఇన్​ప్లూయెన్సర్లు​, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సృజనాత్మకత ఆలోచనలను తీసుకొస్తున్న ఇన్​ప్లూయెన్సర్లుకు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్​ను ఈ సంవత్సరం ప్రకటించింది. స్టోరీ టెల్లర్, పర్యావరణ సుస్థిరాభివృద్ధి, ఎడ్యుకేషన్, గేమింగ్ వంటివి మొత్తం 20 విభాగాలకు చెందిన వారికి ఈ అవార్డులను ఇస్తున్నారు.

read also : Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..