Site icon HashtagU Telugu

Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. పీఎం 2 లక్షలు, సీఎం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Maharashtra Bus Accident

New Web Story Copy 2023 07 01t124011.302

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. బుల్దానాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి తదుపరి బంధువులకు PMNRF (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని. క్షతగాత్రులకు రూ.50,000 ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

బస్సు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఘటనపై విచారణకు ఆదేశించారు.

సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుల్దానాలో మహారాష్ట్రలోని యవత్మాల్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది మరణించగా, 8 మంది గాయపడ్డారు.

Read More: 25 People Died : బస్సులో మంటలు.. 25 మంది సజీవ దహనం