Site icon HashtagU Telugu

India: రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం.. రూ.20,900 కోట్లు విడుదల

Template 2021 12 31t120055

Template 2021 12 31t120055

రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధులను వర్చువల్​గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమయ్యాయి.

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి కింద అర్హలైన రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందిస్తోంది కేంద్రం. దీనిని మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 10వ విడత నిధులను ఖాతాల్లో జమ చేసింది కేంద్రం.

Exit mobile version