PM Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడత (PM Kisan 18th Installment) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. ఈ విడత 5 అక్టోబర్ 2024న విడుదల కానుంది. ఈ సమాచారం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. అంతకుముందు 17వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 2024లో విడుదల చేశారు. జూన్ 18, 2024న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 9.26 కోట్ల మందికి పైగా రైతులకు 17వ విడతగా రూ.21,000 కోట్లకు పైగా ప్రధాని మోదీ విడుదల చేశారు. 16వ భాగం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది.
PM-కిసాన్ పథకం ప్రయోజనాలు
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000, అంటే సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి వంటి మూడు వాయిదాలలో అందించబడుతుంది. ఈ ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Also Read: Best Time To Wake Up: ఉదయాన్నే ఏ సమయంలో నిద్రలేస్తే మంచిది..?
లబ్ధిదారులు వారి స్టాటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు ఇలా
- pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకోండి.
- మీ స్టాటస్ కనిపిస్తుంది.
- లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయండి:
- PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించండి.
- ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
- ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేయండి.
- దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 155261, 011-24300606లను సంప్రదించండి.
PM కిసాన్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?
- pmkisan.gov.in కి వెళ్లండి.
- ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- PM-కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని సేవ్ చేయండి. భవిష్యత్తు కోసం ప్రింటవుట్ తీసుకోండి. ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.