PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. బీహార్‌లోని భాగల్‌పుర్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో అభివృద్ధి ప్రాజెక్టులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ నిధులు ప్రధాని మోడీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
Read Also: Custody : వల్లభనేని వంశీ కస్టడీకి కోర్టు అనుమతి
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభకు హాజరయ్యే ముందు భాగల్పూర్లో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. కాగా, రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో విడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందించే ‘‘పీఎం కిసాన్’’ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్లమంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46లక్షల కోట్లు అందజేసింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే?
.pmkisan.gov.in ని ఓపెన్ చేయండి
.‘కొత్త రైతు రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, .క్యాప్చాను ఎంటర్ చేయండి
.అవసరమైన వివరాలను నమోదు చేసి, ‘ఎస్’ పై క్లిక్ చేయండి.
.పీఎం-కిసాన్ దరఖాస్తు ఫామ్-2024లో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి
.దానిని సేవ్ చేయండి
.ఓ ప్రింటవుట్ తీసుకోండి
.ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కూడా కాల్ చేయవచ్చు 155261, 011-24300606
Read Also: Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు