Site icon HashtagU Telugu

TS Elections: రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచింది : పైలెట్ రోహిత్ రెడ్డి

Mla Pilot Rohit Reddy

Mla Pilot Rohit Reddy

TS Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మంత్రులకు సైతం బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో తాండూరు కౌంటింగ్ సెంటర్ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లిపోయారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానని, కాంగ్రెస్ గాలి వీచింది అని, అందుకే  కాంగ్రెస్ గెలుపునకు దోహదం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు. మా పథకాలు గడప గడపకి వెళ్లాయి.. అయినా, ప్రజలు మమ్మల్ని ఎందుకో తిరస్కరించారో అర్దం కాలేదంటూ పైలెట్‌ రోహిత్‌ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

Also Read: Medak Election: మెదక్ లో బీఆర్ఎస్ కు షాక్, మైనంపల్లి రోహిత్ విజయం