Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి భారీగా పెరిగాయి. గ‌త ప‌దిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీట‌ర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల నుంచి అమ‌లవుతున్నాయి. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఏర్పడిన ఒత్తిడిని భర్తీ […]

Published By: HashtagU Telugu Desk
Online Petrol

Petrol Diesel Price Today

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి భారీగా పెరిగాయి. గ‌త ప‌దిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీట‌ర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల నుంచి అమ‌లవుతున్నాయి. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఏర్పడిన ఒత్తిడిని భర్తీ చేసేందుకు పాక్షికంగా ఈ ధరలను పెంచిన‌ట్లు కేంద్రంయ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.73కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.133.82కు చేరుకుంది. మరోవైపు విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.75కి, లీటర్ డీజిల్ ధర రూ.105.43కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు, లీటర్ డీజిల్ ధర రూ.95.20కి చేరుకుంది.

  Last Updated: 25 May 2026, 08:23 AM IST