Petrol-Diesel: హైదరాబాద్, విజయవాడలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

చమురు కంపెనీలు దేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ (Petrol-Diesel) ధరలను అప్‌డేట్ చేస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Petrol- Diesel

Petrol- Diesel

Petrol-Diesel: చమురు కంపెనీలు దేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ (Petrol-Diesel) ధరలను అప్‌డేట్ చేస్తాయి. ఈ ధరలు అనేక కారణాలపై నిర్ణయిస్తారు. వాటిలో ముడి చమురు ధర ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో విపరీతమైన పెరుగుదల చాలా కాలంగా కనిపిస్తోంది. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని రష్యా, సౌదీ అరేబియా నిర్ణయించిన తర్వాత క్రూడాయిల్ ధరలో పెరుగుదల ఉంది. అయితే శుక్రవారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌లో 0.40 శాతం పతనం తర్వాత ఇది $ 89.56 వద్ద ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.41 శాతం తగ్గి బ్యారెల్‌కు 86.51 డాలర్లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..?

– న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.96.72, లీటర్ డీజిల్ రూ.89.62

– ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27

– కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, లీటర్ డీజిల్ రూ.92.76

– చెన్నైలో పెట్రోల్ రూ.102.63, లీటర్ డీజిల్ రూ.94.24

– హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97. 82

– విజయవాడలో పెట్రోల్ రూ. 111.37, లీటర్ డీజిల్ రూ. 99.15

Also Read: Latest Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు..!

గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

  Last Updated: 08 Sep 2023, 07:57 AM IST