AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది. అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో ఈ పట్టాల పంపిణీ జరిగిందని, అయితే అవి నకిలీ పట్టాలుగా బయటపడటంతో, కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా, త్వరలో అరెస్టులు జరిగే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో పేర్ని నాని, కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Super Six promises : తల్లికి వందనం నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
విచారణకు సిద్ధంగా ఉన్నామని, అధికారులు అడిగిన ఏ విషయాన్నైనా వివరణ ఇచ్చేందుకు తాము తాయారు అని వారు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, మచిలీపట్నం ఆర్డీవో, తహశీల్దార్ తదితర అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుండగా, నాని కుటుంబం కోర్టు తీర్పుపై ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వారి లీగల్ టీమ్ సలహాలు తీసుకుంటూ, తదుపరి కార్యాచరణపై చర్చలు జరుపుతోందని సమాచారం.
Cooking Tips: వంట చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?