Green India Challenge: ప్రతిఒక్కరూ మొక్క‌లు నాటాలి!

  • Written By:
  • Updated On - July 22, 2023 / 05:27 PM IST

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలోని పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా సంతోష్ నోబుల్ అవార్డు గ్ర‌హీత కె స‌త్య‌ర్ధి తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భారతీయులందరూ పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. అనివార్య స్థితిలో చెట్లను నరికివేసిన మళ్లీ వీలైనన్నీ మొక్కలు నాటాలని సూచించారు. ఈ భూమిని మనం విడిచిపెట్టినా మనం నాటిన చెట్లు మిగులుతాయని అన్నారు.

అనంతరం నోబుల్ అవార్డు గ్ర‌హీత కె స‌త్య‌ర్ధి మొక్కలు నాటి మాట్లాడారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు, గ్రీన‌రీని పెంపొందించేందుకు బిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు.. ప్ర‌తి ఇంటితో పాటు గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

Also Read: Deers Video: పంట పొలాల్లో జింకల సందడి, వీడియో వైరల్