టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం చేస్తే..వైసీపీ మంత్రి రోజా మాత్రం సంబరాలు (Minister RK Roja Celebrations) చేసుకుంది. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్నీ పక్కన పెట్టి..స్వీట్స్ పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంది. రోజా ప్రవర్తన ఫై టీడీపీ శ్రేణులే కాదు యావత్ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు.
ఈరోజు జైల్లో ఉన్న చంద్రబాబు ను కలిసిన పవన్ అనంతరం మీడియా తో మాట్లాడుతూ..చంద్రబాబు అరెస్ట్ చేయడం చాలా బాధేసిందని..ఏ తప్పు చేయని చంద్రబాబు ను జైల్లో పెట్టడం వైసీపీ కక్ష్య సాధింపు చర్య అని ఫైర్ అయ్యారు. అలాగే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేసి టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నింపారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ కాగానే మంత్రి రోజా సంబరాలు చేసుకుంది..దీనిపై మీ స్పందన ఏంటి అని మీడియా వారు పవన్ కళ్యాణ్ ను అడగా..అది ముమ్మాటికీ తప్పే అని..ఒకరు అరెస్ట్ అయ్యారని..ఒకరు చంపారని సంబరాలు చేసుకోకూడదని అన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) చనిపోయిన సమయంలో కూడా తాను చాలా బాధ పడ్డానని అన్నారు. అప్పుడు తాను కొమరం పులి షూటింగ్‌లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. జగన్ (YS Jagan) కూడా గతంలో 16 నెలలు జైలులో ఉన్నప్పుడు కూడా తాను తటస్థంగా ఉన్నానని అన్నారు. ఆ విషయాలు తెలుసుకొని తాను సైలెంట్‌గా ఉన్నానని అన్నారు. అలాంటిది 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి జైలులో పెడితే అది సంబరం చేసుకొనే విషయం ఎలా అవుతుందని మంత్రి రోజాను ఉద్దేశించి మాట్లాడారు. అలా చేస్తే వాళ్ల దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మరోపక్క పవన్ ..టీడీపీ తో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించడం ఫై రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. పక్కడి జెండా మోయడం కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారని..ప్యాకేజ్ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నాడని రోజా అన్నారు.