Pawan Condolence To Gaddar : గద్దర్ కొడుకుని హత్తుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్

గద్దర్ పార్థివదేహాన్నీ చూస్తూ పవన్ కన్నీరు పెట్టుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Condolence To Gaddar

Pawan Kalyan Condolence To Gaddar

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గద్దర్ (Gaddar) పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న గద్దర్ ..హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేసారు. అంత బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషమించడం తో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గద్దర్ మరణ వార్త విని యావత్ ప్రజానీకం మూగబోయింది. గద్దర్ ఇకలేరు అని తెలుసుకున్న వారంతా షాక్ లో పడ్డారు. సినీ, రాజకీయ నేతలంతా గద్దర్ తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తూ వచ్చారు.

ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్నీ ప్రజల సందర్శనార్థం LB స్టేడియం (LB Stadium) లో ఉంచారు. గద్దరిని కడసారి చూసేందుకు ప్రజలు , రాజకీయ నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ LB స్టేడియానికి చేరుకొని గద్దర్ పార్థివదేహానికి నివాళ్లు (Pawan Condolence) అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. గద్దర్ కొడుకుని హత్తుకొని పవన్ కళ్యాణ్ ఏడవడం..అక్కడి వారిని మరింత ఎమోషన్లకు గురి చేసింది. రీసెంట్ గా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ .. అపోలో హాస్పటల్ కు వెళ్లి కలవడం జరిగింది. ఇంతలోనే ఆయన మన మధ్య లేరు అని తెలిసి ఎంతో బాధపడ్డారు. గద్దర్ పార్థివదేహాన్నీ చూస్తూ పవన్ కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం ఉదయం వరకు LB స్టేడియం లోనే గద్దర్ పార్థివదేహాన్నీ ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నాం ఆయన నెలకొల్పిన అల్వాల్‌లోని మహాబోధి పాఠశాల ఆవరణలో.. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read Also : Janasena : మల్లవల్లి రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ

  Last Updated: 06 Aug 2023, 11:55 PM IST