Site icon HashtagU Telugu

Patancheru MLA Son : గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి!

Patancheru Mla's Son Died Of Heart Attack!

Patancheru Mla's Son Died Of Heart Attack!

Patancheru MLA : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 30 సంవత్సరాలు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ..

ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్ధన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. మరికాసేపట్లో విష్ణువర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

Also Read:  Heavy Rains: తెలంగాణలో రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు