Telangana : ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి పల్లా రాజేశ్వర్ రెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకర్తల ముందు బోరున విలపించిన తాటికొండ రాజయ్య (MLA Thatikonda Rajaiah) ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డిని పంపగా..ఆయన్ను కలిసేందుకు రాజయ్య నిరాకరించినట్లు తెలుస్తుంది. బుధువారం హన్మకొండలోని రాజయ్య ఇంటికి పల్లా వెళ్లారు. రాజయ్య ఇంట్లో లేకపోవడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) వెనుదిరిగారు. పల్లాను కలవడానికి రాజయ్య (Tatikonda Rajaiah) నిరాకరించారు. దీంతో పల్లా.. ఎంఎల్‌ఎ రాజయ్య అనుచరులతో సమావేశమయ్యారు. రాజయ్యకు […]

Published By: HashtagU Telugu Desk
Palla Rajeshwar Reddy To MLA Rajaiah House

Palla Rajeshwar Reddy To MLA Rajaiah House

స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకర్తల ముందు బోరున విలపించిన తాటికొండ రాజయ్య (MLA Thatikonda Rajaiah) ను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డిని పంపగా..ఆయన్ను కలిసేందుకు రాజయ్య నిరాకరించినట్లు తెలుస్తుంది. బుధువారం హన్మకొండలోని రాజయ్య ఇంటికి పల్లా వెళ్లారు. రాజయ్య ఇంట్లో లేకపోవడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) వెనుదిరిగారు.

పల్లాను కలవడానికి రాజయ్య (Tatikonda Rajaiah) నిరాకరించారు. దీంతో పల్లా.. ఎంఎల్‌ఎ రాజయ్య అనుచరులతో సమావేశమయ్యారు. రాజయ్యకు బిఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని పల్లా రాజేశ్వర్ హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లోనే ఇద్దరం సిఎం కెసిఆర్‌ను కలుస్తామన్నారు. స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ (CM KCR)..రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS Candidates List) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడు స్థానాల్లో మార్పులు చేశారు. మిగితా అన్ని చోట్ల సిటింగ్‌లకే అవకాశం కల్పించారు. మారిన స్థానాల్లో స్టేషన్ ఘన్‌పూర్ కూడా ఉన్నది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇవ్వలేదు. ఈ స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది.

మరోపక్క ఖమ్మంలోను తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడం తో తుమ్మల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతారనే వార్తలు ప్రచారం కావడం తో..అధిష్టానం తుమ్మల వద్దకు నామ నాగేశ్వర్ రావు ను పంపింది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించే పనిలో పార్టీ అధిష్టానం ఉంది.

 

Read Also : Nagrakurnool: మహిళా ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం, ఆపరేషన్ చేసి, కడుపులో దూది మరిచిపోయి!

  Last Updated: 23 Aug 2023, 05:27 PM IST