Site icon HashtagU Telugu

Pakistan Crisis: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం

Government In Pakistan

Pakistan Crisis: పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పెరిగిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కరెంటు ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ విషయంలో పూర్తి సమాచారం అందించాలని ప్రధాని అన్వరుల్-హక్ కకర్ పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ మరియు విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. దీంతో పాటు పెరిగిన కరెంటు ధరల నుంచి దేశ ప్రజలకు ఎలా ఉపశమనం కల్పించాలనేది కూడా ఆలోచిస్తున్నారు. దేశంలోని సాధారణ ప్రజలతో పాటు, కార్మిక సంఘాల ప్రజలు విద్యుత్ ధరల పెంపు తర్వాత అనేక నగరాల్లో నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై చర్చలు ప్రారంభించింది.

Also Read: Food for Childrens : పిల్లలలో ఇమ్యూనిటీ పెంచే ఆహారపదార్థాలు ఇవే..