పాకిస్తాన్ (Pakistan ) వ్యవహార శైలీ మరోసారి విమర్శల పాలవుతోంది. ఎదురుగా నిలిచి యుద్ధం చేయలేని దమ్ముతో, నిజాలను ఒప్పుకునే ధైర్యం లేక, చీకటిలో యుద్ధం చేస్తుంది. రాత్రి సమయంలోనే దాడులకు పాల్పడుతూ, సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా LOC వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ గాలికొదిలేసి విచ్చలవిడిగా కాల్పులు, డ్రోన్ల దాడులు చేస్తోంది. ఈ చర్యలతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Indian Airports Shut: భారత్ – పాక్ టెన్షన్స్.. 32 ఎయిర్‌పోర్టుల మూసివేత
పాక్ డ్రోన్లు రాత్రివేళల్లో చొరబాటుకు ప్రయత్నిస్తూ, పలు సార్లు భారత భద్రతా బలగాలు వాటిని పగులగొట్టాయి. తుపాకుల శబ్దాలు, బాంబుల ధ్వనులతో సరిహద్దు ప్రాంతాలు యుద్ధ ప్రదేశాలుగా మారిపోతున్నాయి. పాక్ ప్రయోగిస్తున్న ఈ రకమైన కిరాతక చర్యలు అంతర్జాతీయ స్ధాయిలో విమర్శలకు దారి తీస్తున్నాయి. భారత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండి ప్రతీసారి పాక్ ప్రయత్నాలను భగ్నం చేస్తూ, దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. పాక్ యుద్ధానికి భయపడే దేశం కాదు అనే సందేశాన్ని ఇవ్వాలన్నది ప్రజల భావన.