Suicide: మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు (42) ఆత్మహత్య రాజకీయంగా కలకలం రేపింది.మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదివారం సాయంత్రం కుటుంబ సమస్యలపై శివరాములు భార్యతో గొడవ పడ్డట్లు సమాచారం. ఆదివారం రాత్రి భార్య ఇంట్లో లేని సమయంలో శివ రాములు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున తండ్రి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించడంతో పిల్లలు బోరున విలపించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన డ్రైవర్ మృతిపై స్పందించాల్సి ఉంది.
Also Read: Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా