Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ షురూ!

(Amarnath Yatra) యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.  

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 12:08 PM IST

పవిత్ర అమర్ నాథ్ (Amarnath Yatra) యాత్రకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.  జూలై 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. జూలై 1 నుంచి ఆగష్టు 31 వరకు అమర్ నాథ్ (Amarnath Yatra) దర్శనం కోసం యాత్రీకులను (Tourists) అనుమతిస్తారు. ఈ యాత్ర పహల్ గావ్ సహా అనంతనాగ్ జిల్లాలోని వాల్తాల్ ప్రాంతం మీదుగా రెండు మార్గాల్లోనూ అనుమతించనున్నారు. అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ (App) ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

అదేవిధంగా స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుసుకునే అవకాశముంది. 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గర్భీణులు, బాలింతలను యాత్రకు అనుమతించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు (Fees) వ్యక్తిగతంగా 220 రూపాయలుగా నిర్ణయించారు. విదేశీ యాత్రీకులకు (Amarnath Yatra) రిజిస్ట్రేషన్ ఫీజును 1520 రూపాయలుగా నిర్ణయించారు.

Also Read: Vikram’s Thangalaan: తంగలాన్ క్రేజీ అప్ డేట్.. ఉత్కంఠ రేపుతున్న విక్రమ్ లుక్!