OnePlus 10R: టాప్ లేపుతోన్న వ‌న్‌ప్ల‌స్ 10ఆర్ ఫీచ‌ర్స్‌…లాంచింగ్ ఎప్పుడంటే..!!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ వన్ ప్లస్...ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లతో బెస్ట్ మొబైల్ ఫోన్స్ ను విడుదల చేస్తోంది. అంతేకాదు బడ్జెట్ ఫోన్స్ కూడా విడుదల చేస్తూ.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 10:30 AM IST

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ వన్ ప్లస్…ఫ్లాగ్ షిప్ స్పెసిఫికేషన్లతో బెస్ట్ మొబైల్ ఫోన్స్ ను విడుదల చేస్తోంది. అంతేకాదు బడ్జెట్ ఫోన్స్ కూడా విడుదల చేస్తూ…బాగా పాపులర్ అయ్యింది. భారత్ లో వన్ ప్లస్ ఈ నెలలోనే రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న వన్ ప్లస్ 10ఆర్ 5జీ, వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్…అనే కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. అంతేకాదు కొత్త ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా ఏప్రిల్ 28న భారత్ లో విడుదల చేయనుంది. అయితే లాంచింగ్ ముందు వన్ ప్లస్ 10ఆర్ 5జీ వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ల స్పెకస్ టీజ్ చేస్తూ..హైప్ పెంచుతోంది వన్ ప్లస్. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

భారత్ లో కంటే ముందుగా డ్రాగన్ కంట్రీలోనే ఒక ఫోన్ విడుదల చేసేందుకు వన్ ప్లస్ కంపెనీ రెడీ అయ్యింది. వన్ ప్లస్ ఏస్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ను ఏప్రిల్ 21న విడుదల చేస్తోంది. వన్ ప్లస్ ఏస్ ఫోన్…వన్ ప్లస్ 10ఆర్ ఒకటేనని టెక్ నిపుణులు అంటున్నారు. ఇవి రెండూ ఒకటేనని కాకపోతే వేర్వేరు పేర్లతో విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ లేటెస్ట్ టీజర్లు కూడా హింట్ ఇస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్ అయిన ఒక వన్ ప్లస్ ఏస్ టీజర్ కొన్ని స్పెసిఫికేషన్ల ను బయటపెట్టింది. వన్ ప్లస్ ఏస్ లో వెనక భాగం కెమెరా సెటప్ ఉంటుందని..ఈ టీజర్ స్పష్టం చేసింది. కొత్త డిజైన్ తో వచ్చే ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్స్ లో లాంచ్ కానుంది.

ఇక ఇందులో వన్ ప్లస్ స్లైడర్ ఉండదు కానీ కింది భాగంలో USB టైప్-సి పోర్టు, కుడివైపు పవర్ బటన్ ఉంటుంది. వన్ ప్లస్ 10ఆర్ గురించి చూసినట్లయితే ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 150వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. వన్ ప్లస్ 10ఆర్ మీడియా టెక్ డైమెన్సిటి 8100మ్యాక్స్ ప్రాసెసర్ సాయంతో రన్ అవుతుందని ఇప్పటికే కంపెనీ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది.

నిజానికి ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100ని ఉపయోగిస్తుంది..కానీ ఈ చిప్ సెట్ ను మీడియాటెక్ డైమెర్సిటి 8100మ్యాక్స్ అని వన్ ప్లస్ పిలుస్తోంది. దీన్ని బట్టి వన్ ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ కోసం మీడియా టెక్ కస్టమ్ వేరియంట్ ను తయారు చేసిందిని…రెగ్యూలర్ డైమెన్సిటీ 8100కంటే ఎక్కువ క్లాక్ స్పీడ్ తో రానుందని తెలుస్తోంది.5,000MAhబ్యాటరీతో వచ్చే నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 33వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుందని వన్ ప్లస్ టీజ్ చేసింది. ఈ ఫోన్లో ట్రిబుల్ కెమెరా సెటప్, హై రిఫ్రెష్ రేట్ ప్యానెల్ కూడా ఉండనున్నట్లు అంచాన. ఈ ఫోన్ ధర మిగతా స్పెసిఫికేషన్లు కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. రూ. 20వేల లోపు ఉండవచ్చని సమాచారం. శాంసంగ్, రియల్ మీ వంటి బ్రాండ్లకు గట్టిపోటినిచ్చే అవకాశం ఉంది.