Site icon HashtagU Telugu

Love Marriage : మారరా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని 40 మందికి గుండు.. పెద్ద కర్మ నిర్వహించి..

Head Shave

Head Shave

Love Marriage : ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ ప్రేమ వివాహం పట్ల స్థానిక గ్రామస్తులు తీసుకున్న తీరుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల వివక్ష, గ్రామ కట్టుబాట్ల పేరిట సమాజంలో మానవతా విలువలు ఎలా దెబ్బతింటున్నాయన్న దానికి ఈ ఘటన తాజా ఉదాహరణగా మారింది.  ఘటన రాయగడ జిల్లాలోని కాశీపూర్ సమితి పరిధిలో గల గోరఖ్‌పూర్ పంచాయతీకి చెందిన ఓ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ వర్గానికి చెందిన ఓ యువతి, షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమ పెళ్లికి యువతి కుటుంబం ఒప్పుకోకపోవడంతో, ఇద్దరూ మూడు రోజుల క్రితం గ్రామం విడిచిపెట్టి మళ్లీ తిరిగి వచ్చారు.

 Parag Tradition : హమ్మయ్య.. మధ్యప్రదేశ్ లో వింత ఆచారానికి బ్రేక్ !!

అయితే, ఈ జంట తిరిగి గ్రామానికి రావడంతో ఊరి పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గ్రామ సంప్రదాయాలను అవమానపరిచారు” అనే ఆరోపణలతో యువతి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. వారి కుటుంబ సభ్యులు తిరిగి సామాజికంగా అంగీకరించబడాలంటే కఠినమైన శిక్షను అనుసరించాల్సిందేనని ప్రకటించారు. గ్రామ పెద్దల ఆదేశాల ప్రకారం, యువతి తరఫు కుటుంబ సభ్యులు, బంధువుల్లో మొత్తం 40 మంది పురుషులు గుండు చేయించుకున్నారు. కేవలం దీంతోనే ఆగలేదు. మూగజీవాలైన మేకలు, గొర్రెలు, కోడులు, పావురాలను బలిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది. గ్రామ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి, కొత్త జంటకు పెద్ద కర్మ నిర్వహించారు. ఈ ప్రక్రియ అనంతరం యువతి కుటుంబాన్ని మళ్లీ గ్రామంలోకి స్వీకరించినట్లు సమాచారం.

 

ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు స్థానిక పోలీసులను ప్రశ్నించగా, తాము ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు పొందలేదని, సమాచారం తెలియలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. ఏ కాలంలో నివసిస్తున్నామనే ప్రశ్నను ఈ ఘటన మన ముందు నిలబెడుతోంది. ప్రేమ పెళ్లి చేసుకున్న తమ సొంత బిడ్డను మానవతా విలువల పేరుతో చులకనచేసి, కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా శిక్షించటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమపెళ్లులపై సమాజానికి తలవంచే విధంగా వ్యవహరించిన గ్రామ పెద్దల తీరును అధికారులు తీవ్రంగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

 APSRTC : ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి .. ఇద్దరు సీరియస్

Exit mobile version