Site icon HashtagU Telugu

College Bus Accident: నర్సింగ్ కళాశాల బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థినులకు గాయాలు!

Bus Accident

Bus Accident

తెలంగాణలోని నల్లగొండ (Nalgonda) జిల్లాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యమో, మితిమీరిన వేగమో.. కానీ కారణాలు ఏమైనా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్‌ శివారులోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్‌ (Nursing) కళాశాల విద్యార్థినులు ప్రయాణిస్తున్న బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో 15 విద్యార్థినులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బస్సులో మొత్తం 40 అమ్మాయిలు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు జిల్లాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!