AP : చంద్రబాబు అరెస్ట్ ఫై నోరుమెదపని జూ ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్

చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కనిపించదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా హాజరు కావడం లేదు

Published By: HashtagU Telugu Desk
ntr kalyan ram silent over chandrababu arrested

ntr kalyan ram silent over chandrababu arrested

40 ఏళ్ల రాజకీయ అనుభవం..14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గా సేవలు..ప్రస్తుతం ప్రతిపక్షనేతగా గుర్తింపు ఇంతటి రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఇప్పుడు యావత్ ప్రజానీకాన్ని షాక్ కు గురిచేస్తుంది. చంద్రబాబు ను అరెస్ట్ చేయడమా..? అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇది ముమ్మాటికీ జగన్ కక్ష్య సాధింపు చర్యగా భావిస్తున్నారు. 73 ఏళ్ల వయసున్న పెద్దాయనను పట్టుకొని CID అధికారులు అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామని రావడం..ఎంతమంది అడ్డువచ్చిన కాదని అదుపులోకి తీసుకోవడం..విచారణ పేరుతో దాదాపు 11 గంటల పాటు జర్నీ చేయించి..ఇప్పుడు నాల్గు గంటలుగా నాల్గు గోడల మధ్య విచారించడం..అందర్నీ బాధేస్తుంది.

చంద్రబాబు ను అరెస్ట్ చేసారని తెలిసి..రాజకీయాలతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ , పలు రంగాల ప్రముఖులు.. పలు పార్టీల పెద్దలు చంద్రబాబుకు మద్దతు పలుకుతూ..అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆయన అరెస్ట్ అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వం (AP Govt) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి అర్ధరాత్రి నుండి ఇంత హంగామా నడుస్తున్న..ఇప్పటివరకు జూ. ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ చంద్రబాబు అరెస్ట్ ఫై నోరుమెదపక పోవడం అందరికి షాక్ కలిగిస్తుంది.

Read Also : Chandrababu Arrest: స్నేహితుడి అరెస్టును ఖండించిన తుమ్మల

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలకు సినిమా షూటింగ్ లేకపోయినా, చంద్రబాబు అరెస్టు విషయం తెలిసినా…. ఎందుకు స్పందించలేదన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కనిపించదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా హాజరు కావడం లేదు. కుటుంబసభ్యులు ఆహ్వానాలు పంపినా… చాలా సందర్భాల్లో దూరంగా ఉంటున్నారు. ఒక వేళ వెళ్లినా, కార్యక్రమంలో అంటీఅంటనట్టుగా ఉంటూ వస్తున్నారు.

కొంతకాలం క్రితం నందమూరి హరిక్రిష్ణ కూతురు సుహసిని కుమారుడి వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరితో పాటు నందమూరి కుటుంబసభ్యులు సందడి చేశారు. వివాహానికి.. అలా వెళ్లి ఇలా వచ్చేశారు ఎన్టీఆర్. రీసెంట్ గా ఢిల్లీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా… వంద రూపాయల నాణెంను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, భువనేశ్వరి, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రామక్రిష్ణ ఇతర నందమూరి కుటుంబసభ్యులు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. ఇలా ప్రతి వేడుకకు , కార్యక్రమానికి దూరంగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలోనైనా వారు స్పందిస్తారని , మద్దతు తెలుపుతారని అంత భవిస్తూ వచ్చారు కానీ వారు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

Read Also : Skill Development Case : చంద్రబాబును సిట్ అధికారులు ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే..

  Last Updated: 09 Sep 2023, 10:13 PM IST