Site icon HashtagU Telugu

Amartya Sen: మా నాన్న చనిపోలేదు, నోబెల్ గ్రహీత కుమార్తె క్లారిటీ

Amartya Sen

Amartya Sen

Amartya Sen: నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరణించారనే వార్తను ఆయన కుటుంబం ఖండించింది. అమర్త్యసేన్ కుమార్తె నందనా దేవ్ సేన్ మాట్లాడుతూ..మా నాన్న గారు బ్రతికే ఉన్నారు. అతను చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదు. అది ఫేక్ న్యూస్. నేను కేంబ్రిడ్జ్‌లోని మా కుటుంబం అతనితో ఒక వారం గడిపాము. అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు, వారానికి రెండు కోర్సులు బోధిస్తున్నాడు, ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉన్నాడు అని కుమార్తె నందనా దేవ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంతకుముందు అమర్త్యసేన్ మరణించారని పలువురు వ్యక్తులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమర్త్యసేన్ మృతికి సంతాంపం తెలిపారు. కాగా ఫేక్ న్యూస్ పై అమర్త్యసేన్ కుమార్తె నందనా దేవ్ సేన్ క్లారిటీ ఇవ్వడంతో సదరు వ్యక్తులు ఎక్స్ లో పెట్టిన పోస్టులను రిమూవ్ చేశారు.

Also Read: Telangana: కేసీఆర్ లక్ష్యం కేటీఆర్ ని సీఎం చేయడమే: షా