TCS : ఉద్యోగులకు టీసీఎస్ షాక్.. నో వర్క్ ఫ్రమ్ హోమ్..!

TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులు అక్టోబర్ 1 నుంచి కచ్చితంగా ఆఫీస్ నుంచి పనిచేయాలని స్పష్టం

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 10:39 PM IST

TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ ఐటీ కంపెనీ తమ ఉద్యోగులు అక్టోబర్ 1 నుంచి కచ్చితంగా ఆఫీస్ నుంచి పనిచేయాలని స్పష్టం చేసింది. వారం లో ఐదు రోజులు ఆఫీస్ కి వచ్చి పనిచేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇక మీదట వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ ఉండదని ఉద్యోగులకు మెయిల్ ద్వారా మెసేజ్ ని చేరవేసింది. కోవిడ్ వల్ల ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కోవిడ్ టైం లో వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేసిన ఉద్యోగులు సమస్య సర్ధుమనిగిన తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం ని కొనసాగించారు.

కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ని కొనసాగిస్తున్నా కొన్ని కంపెనీలు మాత్రం కచ్చితంగా ఆఫీస్ కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు ఇన్ఫాం చేసింది. వారం లో ఐదు రోజులు ఉండగా మొన్నటిదాకా మూడు రోజులు ఆఫీస్ కి వచ్చి.. రెండు రోజులు వర్క్ ఫ్రం హోం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కూడా తీసేస్తూ పూర్తిగా ఆఫీస్ నుంచే పనిచేయాలని TCS తేల్చి చెప్పింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ మొదట ఉద్యోగులకు మంచి వెసులుబాటు ఉందని అనిపించినా ఆ తర్వాత ఇబ్బందులు, సమస్యలు వస్తుండటం వల్ల ఆఫీస్ లకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపించారు. అంతేకాదు ఆఫీస్ లకు వెళ్లి పనిచేయడం వల్ల కో ఎంప్లాయీస్ తో వర్క్ షేరింగ్ ఇంకా హెల్తీ రిలేషన్ ఏర్పడుతుంది. అంతేకాదు ఇంట్లో నుంచి వర్క్ చేయడం వల్ల కొన్ని పే బెనిఫిట్స్ కూడా మిస్ అవుతున్నామన్న ఆలోచన ఉద్యోగులకు ఉంది. TCS కూడా ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోం ని సపోర్ట్ చేసినా ఇక మీదట అందరు ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం ఆఫీస్ ఓన్లీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టు తెలుస్తుంది.

Also Read : Telangana : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలతో..కేసీఆర్ కు చలి జ్వరం – రేవంత్ రెడ్డి