జమ్ముకశ్మీర్‌లో వేర్వేరుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు: రాజీవ్ కుమార్

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 05:34 PM IST

 

Lok Sabha Elections 2024: జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. (Lok Sabha Elections 2024) ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన జమ్ముకశ్మీర్‌లో ఐదు లోక్‌సభ స్థానాలు, లడఖ్‌లో ఒక ఎంపీ స్థానం ఉన్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1తో పోలింగ్‌ ముగుస్తాయి. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు.

read also: Women Power List : ‘ఫోర్బ్స్​ పవర్‌ఫుల్ మహిళల జాబితా’లో గిరిజన జర్నలిస్ట్

లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. 60 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకే విడతలో రెండు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలో కూడా ఏప్రిల్ 19న పోలింగ్‌ జరుగుతుందని అన్నారు.

read also: Ras Malai : వరల్డ్ టాప్-10 ఛీజ్ డెజర్ట్‌లలో మన ‘రస్ మలై’

కాగా, ఒడిశాలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 42 అసెంబ్లీ స్థానాలకు మే 25న, మరో 42 స్థానాలకు జూన్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే దశలో ఓటింగ్ జరుగనున్నది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెల్లడికానున్నాయి.