Site icon HashtagU Telugu

No Entry for CBI in 9 States: ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’ కు నో ఎంట్రీ..!

CBI No Entry in 9 States

Cbi No Entry

అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో (States) కేసులను (Cases) దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని (CBI) తొమ్మిది రాష్ట్రాలు (9 States) నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ (Telangana), పశ్చిమ బెంగాల్ (West Bengal), కేరళ (Kerala), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), జార్ఖండ్ (Jharkhand), మేఘాలయ (Meghalaya), మిజోరం (Mizoram), పంజాబ్‌ (Punjab) రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్ర సింగ్‌ సభలో పేర్కొన్నారు. బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి (CBI) సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించింది.

Also Read:  Vizag : ఏఎస్ఐ సత్యనారాయణ పై దాడి చేసిన ఓ యువతి..!