Site icon HashtagU Telugu

Only Party Chiefs : విపక్షాల మీటింగ్ కు పార్టీల ప్రెసిడెంట్స్ మాత్రమే రావాలి : నితీష్

Nitish Kumar

Nitish Kumar

పాట్నా వేదికగా జూన్ 12న జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశాన్ని వాయిదా వేయడానికి గల ముఖ్య కారణాన్నిఆ మీటింగ్ నిర్వాహకుడు, బీహార్ సీఎం నితీష్  కుమార్ వెల్లడించారు. పార్టీల అధ్యక్ష స్థానంలో ఉన్నవారే (Only Party Chiefs)  మీటింగ్ కు  హాజరు కావాలనే ఒకే ఒక్క అంశం కోసం మీటింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ” కొన్ని పార్టీల అధ్యక్షులకు జూన్ 12న ఇతరత్రా పనులు ఉన్నందున.. ఇతర నాయకులను మీటింగ్ కు పంపుతామని చెప్పారు. అయితే మేం దానికి ఒప్పుకోలేదు. పార్టీల అధ్యక్షులు మాత్రమే(Only Party Chiefs)  హాజరు కావాలనే దానికి కట్టుబడి ఉన్నాం.. అన్ని విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక తేదీలో త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తాం” అని నితీష్ వెల్లడించారు.

Also read : Adipurush Pre-release: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా చినజీయర్.. జనాల్లోకి జై శ్రీరామ్!

జూన్ 12న ఇతరత్రా మీటింగ్ లు ఉన్నందున ఆ రోజు పాట్నాకు రాలేమని కాంగ్రెస్, డీఎంకే పార్టీల అధ్యక్షులు తనతో చెప్పరాని పేర్కొన్నారు.  ఇతర విపక్ష పార్టీలతో మాట్లాడి మీటింగ్ నిర్వహించేందుకు ఇంకో  డేట్ ను సూచించాలని కాంగ్రెస్ పార్టీని కోరానన్నారు. “ఉదాహరణకు  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాకుండా ఇంకొక వ్యక్తిని పంపుతానని చెప్పిందనుకోండి.  దానికి కూడా మేం ఒప్పుకోము” అని నితీష్ స్పష్టం చేశారు.