Monkey Carcass : నిర్మల్ జిల్లాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.
కానీ, వారం రోజులుగా అదే నీటిని తాగిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయోనన్న ఆందోళన లో ఉన్నారు. దీనికి కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటి నిర్వహణ పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన
కోతులు నీటి కోసం ప్రయత్నిస్తూనే లేదా పరస్పరం కీచులాడుకునే సందర్భంలో ఒక కోతి ట్యాంకులో పడిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ట్యాంకుకు సరైన మూత పెట్టకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కలుషిత నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉండటంతో.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇది మొదటిసారి కాకుండా గతంలోనూ ఇలాంటి సంఘటనలు తెలంగాణలో చోటుచేసుకున్నాయి. నాగార్జునసాగర్‌లో, నల్లగొండ జిల్లాలో కూడా మంచినీటి ట్యాంకుల్లో కోతుల కళేబరాలు బయటపడటం విమర్శలకు దారితీసింది. అలాంటి ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వాటర్ ట్యాంకులను తరచుగా పరిశీలించి, శుభ్రం చేసేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.