Nimmala Rama Naidu : సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు నెల రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి రామానాయుడు బుధవారం మాట్లాడుతూ.. రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
గత ఐదు సంవత్సరాలలో రైతులు తమ సమస్యలను అధికారులకు చెప్పుకోగలిగే పరిస్థితి లేకపోయిందని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులను రైతుల దగ్గర పంపించడం ప్రారంభించిందన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయం అందజేసేందుకు సీఎం సహాయనిధి నుండి రూ.8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు.
Eyelash Dandruff : కనురెప్పలపై చుండ్రు? మీరు దీని గురించి విన్నారా?
ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ‘‘పూర్వ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పేదవర్గాలపై కక్షలు, వేధింపులు, కేసులతో వైద్య సాయం అందించకుండా దూరం చేసింది. అయితే, చంద్రబాబు పాలనలో మానవత్వంతో వైద్య సహాయం అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు పాలనలో రైతులకు సంక్రాంతి నెల రోజుల ముందుగానే వచ్చింది. రైతులు తమ ధాన్యాన్ని తమ ఇష్టం ఉన్న మిల్లర్లకు అమ్ముకునే స్వేచ్ఛను పొందడం, అలాగే, వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు 24 గంటల్లోనే జమ అవడం అనేది చాలా కీలకమైన అంశం’’ అని ఆయన అన్నారు.
మరింత వివరణ ఇచ్చిన నిమ్మల రామానాయుడు, ‘‘రైతులు, వ్యవసాయాన్ని వదిలేసి, ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్‌ను కూడా తాకట్టు పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్. రైతులను అబద్దాలతో మోసం చేయడం, రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత వైసీసీ నాయకులకు లేదు. గత ఐదేళ్లలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చాయి. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని, ఈ ఏడాది కౌలు రైతులకు క్రాప్ నమోదు సౌకర్యం అందించినట్టు’’ తెలిపారు.
‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులూ రైతుల దగ్గరకి చేరవచ్చారు. వైసీసీ ఐదేళ్ల పాలనలో రైతులకు సమస్యలు చెప్పుకోవడములో, వారి హక్కులు పొందడములో సమస్యలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు అధికారులను రైతుల దగ్గర పంపిస్తూ, రైతుల సంక్షేమానికి పెద్ద పయనమే తీసుకువస్తున్నాం’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
Manchu Mohan Babu: మోహన్ బాబుకు మరో బిగ్ షాక్.. కేసు నమోదు