Site icon HashtagU Telugu

AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

Nikesh Kumar

Nikesh Kumar

AEE Nikesh : గండిపేట మండలంలోని పీరంచెరువు పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంటనే నిఖేశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఏసీబీ సోదాల్లో అనూహ్య విషయాలు బయటపడ్డాయి. 20 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి దాదాపు రూ. 200 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. నిఖేశ్‌కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, మొయినాబాద్‌లో మూడు ఫాంహౌజులు, మూడు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ఆయన ఎస్బీఐ అకౌంట్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆయనకు గట్టి సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.

Pawan Kalyan OG : పవర్ స్టార్ OGలో మరో స్టార్ హీరో..?

ఆరు నెలల క్రితం లంచం తీసుకుంటూ నిఖేశ్‌ను పట్టుకోవడం జరిగింది. అప్పటి సోదాల్లో రూ. 100 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 2 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలైన నిఖేశ్, తాజాగా మరోసారి అరెస్ట్ చేయబడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సారి కొత్త సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అదనంగా, గండిపేట చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు నిఖేశ్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆయన బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అలాగే, ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువును కాపాడాల్సిన బాధ్యతను తీసుకున్న నిఖేశ్, నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి చెరువు, ఎఫ్టీఎల్ బఫర్‌ను కబ్జా చేసేందుకు మౌనంగా అనుమతిచ్చాడు. కోకాపేట, గండిపేట, నార్సింగ్ మరియు మంచి రేవుల ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. ఈ క్రింద కొన్ని ప్రముఖ కంపెనీలకు అనుమతులు ఇచ్చి వాటి షేర్లలోనూ ఆయన వాటా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ