NIA Raids In TamilNadu : తమిళనాడులో 24 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్.. పీఎఫ్‌ఐ ముసుగు సంస్థలపై ఫోకస్

NIA Raids In TamilNadu : తమిళనాడులో ఆదివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రైడ్స్ జరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - July 23, 2023 / 10:02 AM IST

NIA Raids In TamilNadu : తమిళనాడులో ఆదివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రైడ్స్ జరుగుతున్నాయి. రాష్ట్రంలోని  24 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. 2019లో జరిగిన పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీ నేత కే. రామలింగం హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు  ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో తిరునల్వేలి జిల్లాలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) తమిళనాడు రాష్ట్ర  చీఫ్ ముబారక్ నివాసంలోనూ తనిఖీలు(NIA Raids In TamilNadu)  జరుగుతున్నాయి.

Also read : Best Mileage Cars: మంచి మైలేజీతో కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ కార్లను కొనుగోలు చేయండి..!

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై బ్యాన్ విధించిన తర్వాత తమిళనాడులో ఇంతకుముందు కూడా ఎన్‌ఐఏ అనేక దాడులు నిర్వహించింది. రాష్ట్రంలోని పలు సామాజిక సంస్థల బ్యానర్‌ కింద పీఎఫ్‌ఐ  యాక్టివిటీస్ ను  మళ్ళీ మొదలుపెట్టిందనే సమాచారం అందడంతో .. దానికి సంబంధించిన ఆధారాలను కూడగట్టడంపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. పీఎఫ్‌ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఇప్పుడు  ఎస్‌డీపీఐ తమిళనాడు రాష్ట్ర  చీఫ్ ముబారక్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.