New Year: డిసెంబర్ 31, 2024 మరికాసేపట్లో ముగియనుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని యువత కొత్త సంవత్సరం (New Year) కోసం ఎదురుచూస్తున్నారు. టపాసులు, కేకులు, డీజే సౌండ్ బాక్స్‌లతో కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల్లోని జనం కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సందడి నెలకొంది. పలు రాష్ట్రాల్లో ఇందుకు తగ్గిన విధంగా ఏర్పాట్లు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు. దీంతో ట్యాంక్ బండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే వారిని మాత్రమే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు అనుమతించునున్నారు.
Also Read: Indian Batsman: ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లు వీరే!
పోలీసుల సూచనలు
కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయటం, బైక్‌లతో విన్యాసాలు, రోడ్లపై ఘర్షణ, మత్తులో సమాజానికి ఇబ్బంది కలిగే పనులు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో కఠిన చట్టాలు అమలవుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కటకటాల పాలవుతారని హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని బయట జనసమూహం నుండి స్వాగతం పలకండి.. జైల్లో నుండి కాదని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో పటిష్ట భద్రత
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ పోలీసుల భద్రతా వలయంలో ఉంది. ముఖ్యంగా ఢిల్లీలోని ఇండియా గేట్, కర్ణాటక ప్లేస్, సర్దార్ జంగ్, విజయ్ చౌక్ వంటి ప్రాంతాల్లో జనసంచారాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు. రాత్రి 10 గంటల తర్వాత ముఖ్యమైన ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అంటున్నారు. ఎలాంటి వేడుకలు చేసుకోవద్దని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.