2022: తెలంగాణాలో న్యూ ఇయర్ వేడుకలు

తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు న్యూ ఈయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Published By: HashtagU Telugu Desk
hyderabad

hyderabad

తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు న్యూ ఈయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని, మాస్కులులేకుండా ప్రజలెవరూ బయట తిరగొద్దని ప్రభుత్వం ముందే సూచించిన నేపథ్యంలో ఎక్కువశాతం ప్రజలు పోలీసుల సూచనల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రానున్న సంవత్సరంలో ప్రజలకు మరింత పారదర్శకమైన పాలనను అందించడానికి కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు.

  Last Updated: 01 Jan 2022, 12:22 PM IST