Karthi:కోలీవుడ్ స్టార్ కార్తి, స్టూడియో గ్రీన్ “నా పేరు శివ 2” జనవరిలో థియేటర్ లలో విడుదల

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల.

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:13 PM IST

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు.

ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ నా పేరు శివ 2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.