Site icon HashtagU Telugu

Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

Nepal Plane Crash

Nepal Plane Crash

Nepal Plane Crash: నేపాల్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. క్రాష్‌ అయిన సమయంలో విమానం నుంచి పెద్ద మంటలు చెలరేగడంతో పొగ బాగా కమ్ముకుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.

విమానంలో 19 మంది ఉన్నారు:
ఒక నివేదిక ప్రకారం పోఖారా వెళ్లే విమానంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ఉన్నారని TIA ప్రతినిధి ప్రేమ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. ఈ విమానం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాద స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు:
విమానం పైలట్‌ను ఆసుపత్రికి తరలించినట్లు విమానాశ్రయంలో నియమించబడిన భద్రతా అధికారి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. విమానంలో మంటలు ఆర్పివేశాయని తెలిపారు. ప్రమాద స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితిపై పూర్తి సమాచారం అందలేదు. అయితే ప్రయాణించిన 19 మందిలో 14 మంది మరణించినట్లు తాజా సమాచారం. కాగా ప్రమాద ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Also Read: Kupwara Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం