Site icon HashtagU Telugu

Dog Barking: పొరుగింటి కుక్క అరుస్తోంది సజీవంగా పాతిపెట్టిన వృద్ధురాలు..

Dog Barking, Old Woman Buried It Alive..

Neighbor's Dog Barking, Old Woman Buried It Alive..

బ్రెజిల్‌లో 82 ఏళ్ల మహిళ దారుణానికి పాల్పడింది. తన పొరుగింటి కుక్క (Dog) విపరీతంగా మొరగడంతో దానిని తోటలో సజీవంగా పాతిపెట్టింది. అయితే ఈవిషయం కుక్క యజమానికి (33 ఏళ్ళు) తెలియడంతో వేగంగా పరుగెత్తి వెళ్లి.. కుక్కను పూడ్చిన ప్లేస్ లోని మట్టిని తొలగించింది. నినా అనే పేరు కలిగిన ఆ కుక్క ఇంక బతికే ఉన్నట్టు గుర్తించి బయటకు తీసింది. వెంటనే చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది.ఆ కుక్క సజీవ సమాధిలో గంటన్నర పాటు గడిపిందని గుర్తించారు. అనంతరం ఈవిషయం పై కుక్క (Dog) యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పొరుగు ఇంట్లో ఉండే వృద్ధురాలు తన కుక్కను సజీవంగా పాతి పెట్టిందని ఫిర్యాదు చేసింది. పోలీసులు 82 ఏళ్ల వృద్ధురాలిని ప్రశ్నించగా, “మళ్లీ పాతిపెడతాను” అని చెప్పడం గమనార్హం . దీంతో ఆ వృద్ధురాలిపై జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని అభియోగాలను మోపి, రిమాండ్‌కు తరలించారు.ఆ కుక్కని వృద్ధురాలు పాతి పెట్టిన తర్వాత .. భూమిలోని ఒక రంధ్రం నుండి బయటపడిందని తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ కొరియాలో ఇదే తరహాలో..

దక్షిణ కొరియాలో ఓ అవాంఛనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి సుమారు వేయి కుక్కలను ఆకలిగా ఉంచి చంపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి జంతువులపై దాష్టీకాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, వదిలిపెట్టిన కుక్కలను తీసుకెళ్లి ఆహారం పెట్టకుండా చనిపోయే వరకు నిర్బంధించినట్టు తెలిపాడని అధికారులు వెల్లడించారు.

యానిమల్ రైట్స్ యాక్టివిస్టు ఈ ఘటనపై మాట్లాడారు. డాగ్ బ్రీడర్లు వాటిని వదిలించుకోవాలని ఈ వ్యక్తికి అప్పగించినట్టు తెలిపారు. ఆ కుక్కలు పునరుత్పత్తి వయసును దాటేశాయని, వ్యాపారంగానూ వాటితో గిట్టుబాటు కాని దశకు వచ్చిన తర్వాత కుక్కలను ఈ వ్యక్తికి అప్పగించాయని వివరించారు. 2020 నుంచి ఈ కుక్కలను ఆ వ్యక్తికి అప్పగించి సంరక్షించడానికి ఒక్క కుక్కకు 10 వేల వొన్‌ల చొప్పున చెల్లించినట్టు పేర్కొన్నారు. కానీ, ఆ వ్యక్తి కుక్కలను తీసుకుని నిర్బంధించి ఆహారం పెట్టకుండా చంపేశాడని తెలిపారు. ఈ ఘటన గ్యాంగే ప్రావిన్స్‌లోని యాంగ్‌పియాంగ్‌లో చోటుచేసుకున్నది.

ఓ స్థానికుడు తన కుక్క తప్పిపోవడంతో దాని కోసం వెతుకుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ కుక్కల కళేబరాలు ఒక పొరగా మారిపోయాయని కథనాలు తెలిపాయి. ఆ లేయర్ పైనే మరో వరుసగా ఇంకొన్ని కుక్కల కళేబరాలను ఉంచాడు. ఆహారం లేక ఆకలితో అల్లాడిపోతున్న కుక్కలను బోనులు, సంచులు, రబ్బర్ బాక్సుల్లో ఉంచాడు.

Also Read:  Hair Fall in Teenagers: టీనేజ్‌‌ లో హెయిర్‌ ఫాల్‌కు కారణాలు ఇవే..!