Gujarat: గుజరాత్ ఎన్నికలతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా..!

గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెనకబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి కొంత ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పార్టీకి జాతీయ హోదా లభించనుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), పంజాబ్ లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఓ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కనీస ఓట్ల శాతం, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. ఈ క్రమంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ గోవా ఎన్నికల్లోనూ ప్రభావం చూపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు సీట్లతో పాటు 6 శాతం ఓట్లను సాధిస్తే ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.

తాజాగా గుజరాత్ (Gujarat)లో కూడా తగిన ఓట్ల శాతాన్ని దక్కించుకోనుంది. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తే.. గుజరాత్ లో ఆరు చోట్ల ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలతో పార్టీకి జాతీయ హోదా ఖాయమైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా మీడియాకు తెలిపారు.

Also Read: Sharmila: తెలంగాణ రాజకీయాలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు