Site icon HashtagU Telugu

NCB Raids : హైద‌రాబాద్‌లో కల్లు కాంపౌండ్‌లపై నార్కోటిక్స్ బ్యూరో దాడులు

toddy-shop

toddy-shop

హైదరాబాద్‌లోని క‌ల్లు కాంపౌండ్స్‌పై నార్కోటిక్స్ బ్యూరో దాడులు నిర్వహిస్తోంది. 69 క‌ల్లు కాంపౌండ్‌లను నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఆ క‌ల్లు కాంపౌండ్‌ల్లో కృత్రిమ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అల్ఫాజోలం, లైమ్ సాల్ట్, బీస్‌వాక్స్‌తో కృత్రిమ రాళ్లను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. కల్లు కాంపౌండ్స్‌లో సేకరించిన నమూనాలను అధికారులు ల్యాబ్‌కు పంపారు. కృత్రిమ క‌ల్లు త‌యారీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిగాయి. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ దందాపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టిన నార్కోటిక్స్ బ్యూరో కృత్రిమ క‌ల్లు త‌యారీపై కూడా నిఘా పెంచింది.

Also Read:  AIMIM First List: ఎంఐఎం ఫస్ట్ లిస్ట్ రిలీజ్, జాబితాలో పేర్లు దక్కించుకున్నది వీళ్లే

Exit mobile version