Nara Lokesh : అమెరికాలో పర్యటనలో బిజీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడం కోసం శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ చందు తోట వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ రీసెర్చ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్ రంగాల్లో పొందిన గుర్తింపును వివరించారు. వారు అటానమస్ టెక్నాలజీ , ఏఐ రంగాల్లో అవార్డులు పొందినట్లు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి గూగుల్ (ఆల్ఫాబెట్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $2.01 ట్రిలియన్‌కి చేరుకుందని వివరించారు.
Indiramma Housing Scheme : స్థలం, రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు..?
ఈ సందర్భంగా, మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా మారే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో డాటా సెంటర్లు ఏర్పాటుపై దృష్టి సారించాలన్న ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్‌ను పీపీపీ మోడ్‌లో ఏర్పాటు చేయడం గురించి పరిశీలన చేయాలని మండి చేసారు. అతను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజన్ గురించి కూడా మాట్లాడారు. “మా రాష్ట్రం ఎఐ ఆధారిత ఈ-గవర్నెన్స్ , స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తున్నది,” అని పేర్కొంటూ, ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా పౌర సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
అదనంగా, మంత్రి లోకేష్, గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలు, రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్ వంటి అనేక అంశాలలో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ విద్య, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన గూగుల్‌కు విజ్ఞప్తి చేశారు. మునుపటి సూచనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అవగాహన చేసుకుని తర్వత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత పెట్టుబడులు రాబట్టడం, టెక్నాలజీ రంగంలో అభివృద్ధిని సాధించడం, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం వంటి ప్రధాన లక్ష్యాలు సాధించే అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు.