Site icon HashtagU Telugu

Delhi : ఏపీలో జరిగే అరాచకాలను ఢిల్లీ నేషనల్ మీడియాలో బయటపెట్టిన నారా లోకేష్

Lokesh

Police Case Filed on Nara Lokesh at Nallajarla Police Station with YCP Leaders Complaint

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ , జనసేన పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. మరోపక్క ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు కు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో…. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలోని పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించాలని లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీకి వెళ్లడం జరిగింది.

ప్రస్తుతం అక్కడి మీడియా తో మాట్లాడిన లోకేష్..వైసీపీ సర్కార్ (YCP Govt) నీచ రాజకీయాల గురించి దేశ మొత్తం మాట్లాడుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అక్రమ కేసులో తన తండ్రి చంద్రబాబు ను అరెస్ట్ చేసారని..రాష్ట్రంలో నిజాయితీ పరులను జైలుకు పంపిస్తున్నారని..అక్రమంగా చంద్రబాబు ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారని..చంద్రబాబు కు జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారని లోకేష్ చెప్పుకొచ్చారు.

స్కిల్ డెవలప్ కేసులో ఇక్కడకూడా నగదు చేతులు మారినట్లు నిరూపించలేకపోయారని, ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే చంద్రబాబు ఫై కేసులు పెట్టిందని లోకేష్ మండిపడ్డారు.స్కామ్ జరగలేదని నిరూపించే విలువైన పత్రాలు తనదగ్గర ఉన్నాయని లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు బాగుండాలని జనసేన – టీడీపీ కలిసి పనిచేయబోతున్నాయని లోకేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఏమైనా విదించారా..? అని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని, ఆయన దేనికీ భయపడరని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా సీఎం జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు.

సైబర్‌ టవర్స్‌ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశారు. ఆధారాలు లేకుండా స్కామ్‌ జరిగిందని ఇప్పుడు ఆయనపై కేసు పెట్టారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్‌ వార్‌ మొదలుపెట్టాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. జగన్‌ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని” అన్నారు.