Site icon HashtagU Telugu

Nara Lokesh : బస్ స్టేషన్ లో ప్రమాదానికి ప్రభుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి – నారా లోకేష్‌

Lokesh Vs Jagan

Lokesh Vs Jagan

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తెలిపారు, ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని.. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని ఆయ‌న ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసి గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడంలేదన్నారు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర వత్తిడికి గురవుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు త‌న ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Also Read:  RTC Bus Mishap : విజయవాడ బస్టాండ్ లో బస్సు బీభత్సం….ముగ్గురు మృతి