Site icon HashtagU Telugu

Nagole Metro Station : నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత..

Nagool Metro

Nagool Metro

నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్నటి వరకు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ (nagole Metro Station Parking ) ఉండగా..ఈరోజు ఆ ప్లేస్ లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడంఫై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సిబ్బందికి , వాహనదారులకు మధ్య గొడవ మొదలై..ఘర్షణ వరకు వెళ్ళింది. చాలా ఏళ్లుగా మెట్రో ప్రయాణికులు తమ వాహనాలను ఆ స్థలంలో ఫ్రీగా పార్కింగ్ చేసుకుంటున్నారు. కానీ, గురువారం నుంచి నిర్వాహకులు పెయిడ్ అని చెప్పడంతో వాహనదారుల నుంచి విపరీతమైన వ్యతిరేకత మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

టూ వీలర్ కు రూ.40 వరకూ వసూలు చేస్తూ బోర్డు పెట్టారు. అంతే కాకుండా ఒక ప్రత్యేకమైన యాప్ డౌన్ లోడ్ చేసుకొని, దాని ద్వారా చెల్లింపులు చేయాలని సూచించారు. ‘పార్క్ హైదరాబాద్’ అనే యాప్ నుంచి చేయాలని కండీషన్ పెట్టారు. దీంతో ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ కావడం లేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలే ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉన్న వారిని ఈ పార్కింగ్ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Congress: తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. రేసులో ఆ ముగ్గురు