Mrs Bumrah: బూమ్రా ఫ్లవర్ కాదు ‘ఫైర్’.. భార్య సంజన ట్వీట్!

'నా భర్త ఫైర్..' అని అంటోంది ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్.

  • Written By:
  • Updated On - May 11, 2022 / 04:43 PM IST

‘నా భర్త ఫైర్..’ అని అంటోంది ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్. ఈనెల 9న (సోమవారం) కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ తో దడ పుట్టించాడు. 4 ఓవర్లలో కేవలం 10 మాత్రమే పరుగులు ఇచ్చి, 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వెన్నును బుమ్రా బలంగా విరిచాడు. ఒకానొక దశలో 123 పరుగుల వద్ద కేవలం 2 వికెట్లు కోల్పోయి బలంగా ఉన్న కోల్ కతా టీమ్.. 20 ఓవర్లు వచ్చేసరికి 165 రన్స్ చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇలా జరగడానికి ఏకైక కారణం బుమ్రా బౌలింగ్ ధాటి . రన్స్ ఇవ్వకుండా.. వికెట్లను పేక మేడల్లా కూల్చుతూ బుమ్రా విశ్వరూపం చూపించాడు. ఒక ఓవర్లో అయితే.. బుమ్రా ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టాడు . గ్యాలరీ లో కూర్చొని తన భర్త బుమ్రా విజయ తాండవాన్ని చూసి పులకించిన సంజన వెంటనే ట్విట్టర్ వేదికగా తన మనసులోని మాటను పంచుకుంది. ‘ నా భర్త ఫైర్ ‘ అని కామెంట్ చేసింది. బుమ్రా బౌలింగ్ పై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించిన ప్రముఖుల జాబితాలో వసీం జాఫర్, హర్ష భోగలే కూడా ఉన్నారు.

సంజన ఎవరు ?

ఇంతకీ బుమ్రా భార్య సంజన ఎవరు ? అంటే.. ఆమె పుణె అమ్మాయి. అక్కడే పుట్టి పెరిగింది. మొదట్నుంచీ చదువుల్లో బాగా చురుకైన అమ్మాయి. సింబయోసిస్‌ వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఐటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసింది. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సంజనా గణేశన్‌కు ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. మిస్‌ ఇండియా కావాలనేది ఆమె చిన్ననాటి కల. 2014లో బెంగళూరులో జరిగిన ఫెమీనా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంది. కొద్దిలో కిరీటం కోల్పోయింది. అనంతరం ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా 7 సీజన్‌ లో పాల్గొంది. గాయం కారణంగా ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. 2019 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌తో సంజన స్టార్‌ ప్రెజెంటర్‌ అయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిర్వహించే ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘చీకీ సింగిల్స్‌’ కార్యక్రమాల్లో తనదైన శైలిలో హోస్టింగ్‌తో అందర్ని ఆకట్టుకుంది. సంజనా బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌కు వీరాభిమాని. ఖాన్‌ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఎక్స్‌క్లూజివ్‌ షోలు కూడా చేసింది. బుమ్రా, సంజనా ప్రేమకథ కూడా క్రికెట్‌ మైదానంలోనే మొదలైందంటారు. 2013, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శన చేశాడు బుమ్రా. అతడిని సంజన ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.