Site icon HashtagU Telugu

Pahalgam Terror Attack : ముస్లింలంతా చేయాల్సిన పని అదే – అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

Aimim President Asaduddin O

Aimim President Asaduddin O

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 26మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Aimim president asaduddin owaisi) తీవ్రంగా స్పందించారు. ఈ అమానవీయ దాడిని ఖండిస్తూ.. దేశంలోని ముస్లింలందరూ సంఘీభావం తెలిపేలా ఓ ప్రత్యేక పిలుపునిచ్చారు. ముస్లింలు రేపు నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు.

India-Pakistan War : యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా? ఎవరి బలం ఎంత..?

ఒవైసీ చెప్పిన ప్రకారం.. ఇలాంటి హింసాత్మక ఘటనలకు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన సమయం ఇది. ఉగ్రవాదం అనే పిశాచం మతానికి, జాతికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రమాదమేనని చెప్పారు. ముస్లింలు శాంతికి ప్రతీకలుగా ఉండాలన్నదే తన ఆకాంక్షని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడి ముస్లింలను కలచివేస్తే తప్ప, దేశానికి మేలు జరగదని అన్నారు.

ఇదే సమయంలో కేంద్రం పహల్గామ్ ఘటనపై అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆచరణాత్మక చర్యల కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. సమావేశంలో ఉగ్రవాదాన్ని జాతికి వ్యతిరేక శక్తిగా వ్యవహరించాలని, అందరి భాగస్వామ్యంతో దాన్ని ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు.