INDIA Meet Postponed : విపక్ష కూటమి “ఇండియా” మూడో భేటీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై వేదికగా ఆగస్టు 25,26 తేదీల్లో మూడోసారి భేటీ కావాలని కూటమి నేతలు గతంలో నిర్ణయించారు. ఈ సమావేశాలకు శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే కూటమిలోని కొన్ని పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసే(INDIA Meet Postponed) అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also read : Dead Body In Bag : జ్యూస్ కొనిస్తానని ఎత్తుకెళ్లి దారుణం.. ఐదేళ్ల పాపపై హత్యాచారం
ఇప్పటికే పాట్నా, బెంగళూరులో రెండు సార్లు సమావేశమైన “ఇండియా” కూటమి నేతలు.. ముంబై వేదికగా మూడోసారి సమావేశమై సీట్ల సర్దుబాటు, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలపై చర్చలు జరుపుతారనే టాక్ వినిపించింది. కూటమి నాయకత్వ సమస్యకు ముంబై భేటీలో ఓ పరిష్కారం లభిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. కాస్త ఆలస్యంగా జరిగినా “ఇండియా” కూటమి మూడో భేటీలో.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.